అనన్యరెడ్డిని అభినందించిన సీఎం రేవంత్‌

యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.

Published : 21 Apr 2024 03:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. శనివారమిక్కడ ఆమె కుటుంబసభ్యులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా అనన్యరెడ్డిని సీఎం సన్మానించారు. అభినందనలు తెలిపిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఉన్నారు.


ముఖ్యమంత్రిని కలిసిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తులసి శ్రీనివాస్‌తో పాటు వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు శనివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ఉన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వాదం అందజేశారు. పేదల సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని బ్రాహ్మణ ప్రతినిధులు స్పష్టం చేశారు.


మహావీరుడి బోధనలు ఆచరణీయం: సీఎం

శాంతియుత పోరాట పథంలో వర్థమాన మహావీరుడి ఆధ్మాత్మిక బోధనలు ఆచరణీయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జైనుల ఆరాధ్య దైవం వర్థమాన మహావీరుడి జయంతిని పురస్కరించుకొని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో క్రమశిక్షణతో కూడిన జీవనానికి ఆయన బోధనలు ఎంతో దోహదపడుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని