ఐసీయూలోనూ ఫ్యాన్లే గతి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో సుమారు నెల రోజులుగా ఏసీలు పనిచేయడం లేదు.

Published : 21 Apr 2024 05:05 IST

ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో సుమారు నెల రోజులుగా ఏసీలు పనిచేయడం లేదు. ఆసుపత్రి యాజమాన్యం 10 చిన్న టేబుల్‌ ఫ్యాన్లు అక్కడక్కడ ఏర్పాటు చేసింది. ఆ గాలి చాలక ఉక్కపోతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సొంత డబ్బులతో ఫ్యాన్లు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఆదిలాబాద్‌ ఒకటి. ఈ నేపథ్యంలో ఐసీయూలో ఏసీలు పనిచేసేలా చూడాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

ఈనాడు, ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వైద్య విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని