ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..

విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది.

Published : 24 Apr 2024 05:42 IST

విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం మార్గంలోని రాఘవమ్మకుంట సమీపంలో ఎనిమిదెకరాల్లో విత్తనోత్పత్తి సాగు చేపట్టిన రైతు మునయ్య పరిస్థితీ ఇదే. సమీపంలోని రాఘవమ్మకుంట ఎండిపోవడంతో నీటిఎద్దడి ఏర్పడి పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో క్షేత్రాన్ని ఇలా పశువులకు మేతగా వదిలేశారు. దాదాపు రూ.2 లక్షల పెట్టుబడి నష్టపోయానని వాపోతున్నారు.

న్యూస్‌టుడే, వెంకటాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని