బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా

బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది.

Published : 24 Apr 2024 03:42 IST

పెద్దపల్లి, రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది.  మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బిలోలి కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు.. కరీంనగర్‌, పెద్దపల్లి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, విజయరమణారావు, ప్రకాశ్‌గౌడ్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు హన్మంతుషిండే, కేఎస్‌ రత్నం, ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్‌బాబు హాజరయ్యారు.

ఈ కేసు విచారణలో తన హాజరును మినహాయించాలంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నాగ్‌పుర్‌ హైకోర్టు బెంచిలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మే 3న హైకోర్టు బెంచ్‌ విచారణ నిర్వహించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని