విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్‌ శేషసాయి ధర్మాసనం

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్‌ బీటెక్‌ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది.

Published : 25 Apr 2024 03:23 IST

సునీత, బీటెక్‌ రవిల వ్యాజ్యాల విషయంలో నిర్ణయం

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్‌ బీటెక్‌ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. ఈ వ్యాజ్యాలు తగిన బెంచ్‌ వద్దకు విచారణకు వచ్చేలా ఫైళ్లను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించి మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సునీత, బీటెక్‌ రవి దాఖలు చేసిన వ్యాజ్యాలు బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎన్‌ విజయ్‌తో కూడిన ధర్మాసనం వద్దకు వచ్చాయి. వేరే బెంచ్‌ వద్దకు విచారణకు వచ్చేలా ఫైళ్లను సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు