ఈఎస్‌ఐసీ ‘వార్డ్‌ఆఫ్‌ ఇన్‌స్యూర్డ్‌ పర్సన్‌’ సర్టిఫికెట్‌

ఈఎస్‌ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్‌స్యూర్డ్‌ పర్సన్స్‌’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్‌ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్‌ఐసీ ప్రకటన జారీ చేసింది.

Published : 28 Apr 2024 03:48 IST

దరఖాస్తులకు ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: ఈఎస్‌ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్‌స్యూర్డ్‌ పర్సన్స్‌’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్‌ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్‌ఐసీ ప్రకటన జారీ చేసింది. జాతీయ అర్హత పరీక్ష (యూజీ-నీట్‌)-2024లో అర్హత సాధించిన విద్యార్థులు దీని కింద సీట్లు పొందేందుకు అర్హులని తెలిపింది. అయితే అభ్యర్థులకు ఈఎస్‌ఐసీ జారీ చేసిన ‘వార్డ్‌ఆఫ్‌ ఇన్‌స్యూర్డ్‌ పర్సన్‌’ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈఎస్‌ఐసీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని,  మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.  దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మే 15 నాటికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈఎస్‌ఐసీ ఆధ్వర్యంలో 11 వైద్య కళాశాలలు, ఒక దంత వైద్య కళాశాల, రెండు నర్సింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వైద్య కళాశాలలో 466 సీట్లు, దంతవైద్య కళాశాలలో 28, నర్సింగ్‌లో 60 సీట్లు బీమా కార్మికులకు కేటాయించినట్లు పేర్కొంది. జాతీయ కోటా, రాష్ట్ర కోటా సీట్లు భర్తీ చేసిన తరువాత ఐపీ కోటా కింద సీట్లు కేటాయిస్తామని కార్పొరేషన్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని