దూరవిద్య బలోపేతానికి ప్రభుత్వాలు సహకరించాలి

దూరవిద్య బలోపేతం చేయడంతో పాటు, ఆధునికీకరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఓయూలో నిర్వహించిన జాతీయ సదస్సులో వక్తలు విజ్ఞప్తి చేశారు.

Published : 29 Apr 2024 02:56 IST

జాతీయ సదస్సులో వక్తల సూచన

ఈనాడు, హైదరాబాద్‌: దూరవిద్య బలోపేతం చేయడంతో పాటు, ఆధునికీకరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఓయూలో నిర్వహించిన జాతీయ సదస్సులో వక్తలు విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్య గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌లో దూరవిద్య వాటా దేశంలో 12 శాతం ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో 17 శాతం ఉందని తెలిపారు. ‘ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూరవిద్య కేంద్రం’, ఇండియన్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ (ఐడీఇఏ) సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆదివారం ఉపకులపతులు నాగేశ్వర్‌రావు (ఇగ్నూ), డి.రవీందర్‌ (ఓయూ), కె.సీతారామారావు (డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం), తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఐడీఇఏ నూతన అధ్యక్షులుగా అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ కె.సీతారామారావు, సెక్రటరీ జనరల్‌గా ఎల్‌.విజయకృష్ణారెడ్డిలను ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని