అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి.
తొలి విడతగా ఈ నెల రెండో వారంలో విడుదల
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో ఫాల్ సీజన్‌కు సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు-సెప్టెంబరు మధ్య ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం గత కొంతకాలంగా ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, ముంబయి కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయం అధికారి ప్రతినిధి ‘ఈనాడు’కు తెలిపారు. ‘‘అమెరికా-భారత్ ప్రజల మధ్య ఉన్న లోతైన సంబంధాల దృష్ట్యా భారత్‌కు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023లో రికార్డుస్థాయిలో 11 లక్షల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను భారతీయులకు అమెరికా జారీచేసింది. 3.75 లక్షల మందికి పిటిషన్ ఆధారిత తాత్కాలిక ఉపాధి వీసాలను (హెచ్1బీ) కూడా జారీ చేసింది. భారతీయుల నుంచి వీసాల కోసం డిమాండ్ భారీగా ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు హైదరాబాద్‌లో 300 మిలియన్ డాలర్ల వ్యయంతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం.
స్టెమ్ కోర్సులతో పాటు పలు వినూత్న కోర్సులపైనా భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్, మైక్రో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటర్ కోర్సులైన ఏఐ, రోబోటిక్స్‌లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే సైకాలజీ సబ్జెక్టుపైనా మొగ్గు చూపుతున్నారు. అమెరికా-భారతీయ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న డ్యూయల్ డిగ్రీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2022-23 గణాంకాల ప్రకారం అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కు సంబంధించి 69,062 మంది విద్యార్థులతో భారతదేశం అగ్రగామిగా ఉంది. వరుసగా మూడో సంవత్సరం కూడా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారు’’ అని అధికార ప్రతినిధి వివరించారు. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య తాజాగా 2,68,923కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో చదువుకుంటున్న ప్రతి మిలియన్ విదేశీ విద్యార్థుల్లో 25% మంది భారతీయులే ఉంటున్నారు. 2023లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 63% పెరిగింది. అండర్ గ్రాడ్యుయేట్స్ 16% పెరిగారు.
వెబ్సైట్ సమస్య చక్కదిద్దాం
తరచుగా వస్తున్న వెబ్సైట్ ఇబ్బందులను చక్కదిద్దినట్లు అధికారులు స్పష్టం చేశారు. ‘‘వీసా స్లాట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను 2023 జులైలో ఆధునికీకరించాం. సాంకేతిక లోపాలను తగ్గించేందుకు నూతన వ్యవస్థను తీసుకువచ్చాం. ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మా దృష్టికీ వచ్చింది. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం. ఇంకా వెబ్సైట్ సమస్యలు ఎదురవుతుంటే సహాయం కోసం support-india@ustravelsdocs.com ను సంప్రదించవచ్చు’’ అని అధికార ప్రతినిధి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్‌యూ స్ట్రాంగ్‌రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్‌రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్‌రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్‌లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్‌రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్‌రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్‌రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్‌సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్‌సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్‌సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్‌లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!