నేలపైనే గూడు.. ఒకే భాగస్వామి తోడు..

కంటి చుట్టూ పసుపురంగు వలయంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న పక్షి హైదరాబాద్‌లోని కాప్రా చెరువు వద్ద కనిపించింది. ‘‘ఇది ‘లిటిల్‌ రింగ్డ్‌ ప్లవర్‌’ (శాస్త్రీయనామం చరడ్రియస్‌ డుబియస్‌) జాతికి చెందిన పక్షి.

Published : 03 May 2024 05:11 IST

బురద నేలల్లో సంచరించే ఓ బుజ్జి పిట్ట కథ

కంటి చుట్టూ పసుపురంగు వలయంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న పక్షి హైదరాబాద్‌లోని కాప్రా చెరువు వద్ద కనిపించింది. ‘‘ఇది ‘లిటిల్‌ రింగ్డ్‌ ప్లవర్‌’ (శాస్త్రీయనామం చరడ్రియస్‌ డుబియస్‌) జాతికి చెందిన పక్షి. ఈ పక్షుల శరీర పైభాగం, రెక్కలు బూడిద-గోధుమ రంగులో ఉంటాయి. కింది భాగం తెల్లగా ఉంటుంది. మెడపై, తలపై నల్లటి గీతలు ఉంటాయి. సంతానోత్పత్తి కాలంలో ఈ పక్షులు చెరువులు, నీటికుంటల సమీపంలో చెట్లు, మొక్కలు లేని చోట.. నేలపై గూళ్లు కట్టుకుంటాయి. కీటకాలు వీటి ప్రధాన ఆహారం. బురద నేల ఉపరితలాలపై తమ ఆహారం వెతుక్కుంటాయి. మార్చి నుంచి మే వరకు సంతానోత్పత్తి చేస్తాయి. ఆడపక్షి, మగపక్షి ఒకసారి జతకడితే.. జీవితకాలమంతా కలిసే ఉంటాయి. చెరువుల్లో పూడికతీతకు వినియోగించే ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లతో పాటు గేదెల వల్ల ఈ పక్షుల గూళ్లకు నష్టం వాటిల్లి.. ఈ జాతి అంతరించే ప్రమాదంలో ఉంది’’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర ప్రొఫెసర్‌ శ్రీనివాసులు వివరించారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని