నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు

యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Published : 20 May 2024 03:18 IST

యాదాద్రి ఆధ్యాత్మికవాడలో ఆదివారం భక్తుల వాహనాల రద్దీ

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8:30 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, సాయంత్రం జరిగే అంకురార్పణ క్రతువులతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని ప్రధాన పూజారి నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. 

ఆదివారం యాదాద్రి క్షేత్ర సందర్శనకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక వాడలోని రహదారులు, పార్కింగ్‌ ప్రాంతం, వ్రత మండపం, పుష్కరిణి ప్రాంగణం, మండపాలు కిక్కిరిశాయి. రద్దీ అధికంగా ఉండటంతో బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.85,33,262 ఆదాయం సమకూరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని