తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి

రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 20 May 2024 04:44 IST

జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌

మాట్లాడుతున్న జస్టిస్‌ చంద్రకుమార్, చిత్రంలో పృథ్వీరాజ్‌ యాదవ్, విఠల్‌

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు సమస్యలపై అనేక చోట్ల రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించట్లేదన్నారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చి, కొనుగోలులో జాప్యం లేకుండా, ధర తగ్గించకుండా కొనేలా చూడాలన్నారు. ప్రతి మార్కెట్‌లో వ్యవసాయశాఖ శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి పంటకు బీమా వర్తింపచేయాలని, ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి ప్రీమియం మొత్తాన్ని తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే బస్సు యాత్ర చేస్తామని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు విఠల్‌ మాట్లాడుతూ.. తూకంలో తరుగు పేరుతో 5 కిలోలు తీసుకుంటున్నారని, డిజిటల్‌ కాంటా రిమోట్‌తో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుడు డా.పృథ్వీరాజ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని