జూన్‌ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి.

Published : 21 May 2024 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. అంటే 5-8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొంత ఆలస్యమైతే జూన్‌ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళకే జూన్‌ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటిన విషయం తెలిసిందే. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్‌ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి ‘ఈనాడు’కు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని