శిఖం భూమిలో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీ కూల్చివేత

మాజీ మంత్రి, మేడ్చల్‌ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి కొనుగోలు చేసిన ఓ భూమికి సంబంధించిన ప్రహరీని శామీర్‌పేట మండల రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖల అధికారులు శుక్రవారం కూల్చివేశారు.

Published : 25 May 2024 04:43 IST

ఇతరులు చేపట్టిన నిర్మాణాలూ ధ్వంసం

శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట చెరువు శిఖం భూమిలో నిర్మించిన ప్రహరీని కూల్చివేసిన సిబ్బంది

 శామీర్‌పేట, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, మేడ్చల్‌ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి కొనుగోలు చేసిన ఓ భూమికి సంబంధించిన ప్రహరీని శామీర్‌పేట మండల రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖల అధికారులు శుక్రవారం కూల్చివేశారు. శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామ చెరువు శిఖం, బఫర్‌ జోన్‌లోని సర్వే నంబరు 408లో మల్లారెడ్డి దాదాపు రెండేళ్ల క్రితం 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అది పూర్తిగా ఎఫ్‌టీఎల్‌(ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలోకి రావటంతో గ్రామస్థులు, రైతులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ భూమికి మల్లారెడ్డి ప్రహరీ నిర్మించడంతో.. పక్కనే భూములు కొనుగోలు చేసిన మరికొందరు కూడా ఇదే మాదిరి ప్రహరీ, రహదారులు నిర్మిస్తున్నారు. దీంతో ఆక్రమణలు నిలువరించాలని భావించిన అధికారులు మాజీ మంత్రి సహా ఇతరులకు సంబంధించిన 25 ఎకరాల్లో ప్రహరీలు, రహదారులను ధ్వంసం చేశారు. చెరువు శిఖం, బఫర్‌ జోన్‌ భూముల్లో నిర్మాణాలపై సంబంధితులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవటంతో కూల్చివేశామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని