ప్రత్యక్ష దైవాలు.. ఇక కళ్లముందే

కాలం చేసిన తమ కన్నవారికి ఆ కుమారులు గుడి కట్టి ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన గొట్టె కనకయ్య, కొమురవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి సంతానం.

Published : 25 May 2024 04:53 IST

గుడిలో ప్రతిష్ఠించిన కొమురవ్వ, కనకయ్య విగ్రహాల వద్ద మహేందర్, చిరంజీవి, సదయ్య తదితరులు 

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: కాలం చేసిన తమ కన్నవారికి ఆ కుమారులు గుడి కట్టి ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన గొట్టె కనకయ్య, కొమురవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి సంతానం. సదయ్య, మహేందర్‌ వ్యవసాయం చేస్తుండగా.. చిరంజీవి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో, ఏడాది క్రితం తండ్రి పాముకాటుతో కన్నుమూశారు. అమ్మానాన్నలిద్దరూ దూరమవడాన్ని కుమారులు జీర్ణించుకోలేకపోయారు. వారు నిత్యం తమ కళ్లముందు ఉండేలా తమ వ్యవసాయ భూమిలో గుడి నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు. శుక్రవారం తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ విగ్రహాలను ఆవిష్కరించి పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని