నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు నోటీసులు: రెరా

నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ ఆథారిటీ (రెరా) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 27 May 2024 02:59 IST

ఈనాడు,హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ ఆథారిటీ (రెరా) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మియాపూర్‌ ప్రజ్ఞ ఎకోస్పెన్, చింతల్‌కుంట శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్, కొండాపూర్‌ నార్త్‌ ఈస్ట్‌ హ్యాబిటేషన్స్, సంగారెడ్డి జిల్లా వి.ఆర్‌.ప్రమోటర్స్‌ అండ్‌ డెవలపర్స్,  కేపీహెచ్‌బీ కాలనీ ఇన్వెస్ట్‌ ఇన్ఫ్రాప్రాజెక్టు, కొంపల్లి బారతి లేక్‌వ్యూ టవర్‌ బిల్డర్స్‌ రెరా నిబంధనలు ఉల్లంఘించినందున పక్షం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు ఇచ్చామని తెలిపింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, యూడీఏ, టీజీఐఐసీ స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేషన్‌ ఉంటేనే కొనుగోలుదారులకు భద్రత, భరోసా చేకూరుతుందని పేర్కొంది. ఇల్లు, ఫ్లాట్‌ కొనాలనుకునే వారు రెరా రిజిస్టర్డు ప్రాజెక్టుల్లో మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. స్థిరాస్తి సంస్థలు అనుమతులు పొందకుండా వ్యాపార ప్రకటనలు జారీచేయడం, మార్కెటింగ్‌కు పాల్పడడం నేరమని స్పష్టంచేసింది. రెరా ఇప్పటివరకు 8,270 ప్రాజెక్టులకు రిజిస్ట్రేషన్లు చేసిందని, 918 ప్రాజెక్టులు నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించి రూ.30,99,12,963 అపరాధ రుసుం విధించినట్లు అథారిటీ తెలిపింది. అందులో రూ.13,70,08,925 రికవరీ చేసినట్లు అథారిటీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని