యాదాద్రికి పోటెత్తిన భక్తులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వయంభువుడైన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.

Published : 27 May 2024 05:21 IST

81 వేల మందికి దర్శనం.. రూ.1.02 కోట్ల ఆదాయం

భక్తులతో కిక్కిరిసిపోయిన క్యూ కాంప్లెక్స్‌

యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వయంభువుడైన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. మొక్కు పూజలు నిర్వహించిన భక్తులతో మండపాలు సందడిగా మారాయి. వేకువజాము నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ప్రసాదాల విక్రయ విభాగం కిటకిటలాడింది. మాడ వీధులు, పట్టణ దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. శనివారం 60 వేల మందికి పైగా.. ఆదివారం 81 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ విభాగాల ద్వారా స్వామివారి ఖజానాకు రూ.1.02 కోట్ల నిత్యాదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని