ఏడునూతుల బావి.. ఆ ఊరి జలతావి

ఈ కాలంలో సాధారణంగా బావుల్లోని నీటిని నేరుగా ఎవరూ తాగడం లేదు. కానీ జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడునూతుల ఊరి ప్రజలు మాత్రం ఓ బావిలో నీటిని దోసిట పట్టి తాగుతారు.

Updated : 27 May 2024 05:43 IST

ఈ కాలంలో సాధారణంగా బావుల్లోని నీటిని నేరుగా ఎవరూ తాగడం లేదు. కానీ జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడునూతుల ఊరి ప్రజలు మాత్రం ఓ బావిలో నీటిని దోసిట పట్టి తాగుతారు. గ్రామంలోని పెద్దచెరువు వద్ద ఉన్న ఈ బావిని సుమారు 200 ఏళ్ల క్రితం ఏడుగురు అక్కాచెల్లెళ్లు కలిసి తవ్వించారని తమ పూర్వీకులు చెప్పినట్లు 92 ఏళ్ల వృద్ధుడు అంజయ్య వివరించారు. జలతావి అయిన ఈ బావి పేరు మీదుగానే గ్రామానికి ఏడునూతులు అనే పేరొచ్చిందని చెబుతుంటారు. ఊరికి మిషన్‌ భగీరథ ద్వారా ఫిల్టర్‌ నీరొచ్చినా ఈ బావి నీటిని తాగేందుకే గ్రామస్థులు ఇష్టపడతారు. వేసవిలోనూ ఇది ఇంకదు. నీటి విలువ తెలిసేలా గ్రామస్థులు తోడేందుకు బొక్కెన మాత్రమే వాడుతున్నారు. మోటార్లు వాడితే అవసరానికి మించి నీరు వృథా అవుతుందని చెబుతున్నారు.

         

ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే, కొడకండ్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు