ఎరువుల దుకాణాల్లో ఇక విస్తృతంగా తనిఖీలు

దేశవ్యాప్తంగా నకిలీ ఎరువులను అరికట్టేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీనికోసం విస్తృతంగా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిత్యం ఎరువుల నమూనాలను తీసి ప్రయోగశాలల్లో పరీక్షలు చేయించి ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది.

Published : 28 May 2024 03:57 IST

నమూనాలతో నాణ్యత పరీక్షలు
వాటి నిల్వల పరిరక్షణ బాధ్యతల జేడీకి..
ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నకిలీ ఎరువులను అరికట్టేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీనికోసం విస్తృతంగా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిత్యం ఎరువుల నమూనాలను తీసి ప్రయోగశాలల్లో పరీక్షలు చేయించి ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. నమూనాల నిల్వల రక్షణ (సేఫ్‌ కస్టడీ) కోసం రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జేడీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణలో నాణ్యత పరీక్షల కోసం తీసే ఎరువుల నమూనాల (శాంపిల్స్‌) నిల్వల రక్షణ బాధ్యతలను వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుని (భూసార విభాగం)కి అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రయోగశాలల్లో నాణ్యత పరీక్షలు నిర్వహించిన నిల్వలను ఆయన పరిరక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో ఎరువుల నమూనాలు తీసి ఫలితాలను వెల్లడించిన తర్వాత ఈ నమూనాలను భద్రపరచడం లేదు. దీంతో  న్యాయస్థానాల్లో ఈ కేసులు వీగిపోతున్నాయి. చట్టపరంగా చర్యలకు అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిల్వల పరిరక్షణపై దృష్టి సారించి రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని