నారాయణపేట జిల్లా వరకు విస్తరించిన నైరుతి

నైరుతి రుతుపవనాలు మంగళవారం నాటికి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నారాయణపేట జిల్లా వరకు విస్తరించినట్లు వాతావరణశాఖ పేర్కొంది.

Published : 05 Jun 2024 04:32 IST

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు మంగళవారం నాటికి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నారాయణపేట జిల్లా వరకు విస్తరించినట్లు వాతావరణశాఖ పేర్కొంది. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర తమిళనాడు తీరం వరకు నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని చెప్పింది. మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండల కేంద్రంలో 6.7, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో 6.4, కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో 6.1 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని