మేడిగడ్డ బ్యారేజీలో మరో రెండు గేట్ల ఎత్తివేత

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన, దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లో 16, 17 గేట్లను ఇంజినీరింగ్‌ అధికారులు గురువారం సాయంత్రం 100.50 మీటర్ల మేర (పూర్తిస్థాయిలో) పైకెత్తారు. బ్యారేజీలో మొత్తంగా 85 గేట్లు ఉన్నాయి.

Published : 07 Jun 2024 04:36 IST

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో పైకెత్తిన 16వ గేటు

మహదేవపూర్, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన, దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లో 16, 17 గేట్లను ఇంజినీరింగ్‌ అధికారులు గురువారం సాయంత్రం 100.50 మీటర్ల మేర (పూర్తిస్థాయిలో) పైకెత్తారు. బ్యారేజీలో మొత్తంగా 85 గేట్లు ఉన్నాయి. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తాలని, సమస్య వస్తే తొలగించాలని సూచించింది. గత నెల 17న 15వ గేటును పైకెత్తగా.. మరుసటి రోజు 16వ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అనువుగా ఉన్న గేట్లను ఎత్తుతూ..సమస్యలున్న వాటిని కటింగ్‌ ద్వారా తొలగించే పనులు చేస్తున్నారు. మరోవైపు 20వ గేట్‌ కటింగ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం ఐదు గేట్లను తొలగించాల్సి ఉంది. ఎన్‌డీఎస్‌ఏ సిఫారసుల మేరకు దిల్లీకి చెందిన సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్‌)కు చెందిన హరిదేవ్‌ నిపుణుల బృందం రెండోరోజు పరీక్షలను కొనసాగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని