రేపటి నుంచి పీజీఈసెట్‌

రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌(పీజీఈసెట్‌) నిర్వహించనున్నారు.

Published : 09 Jun 2024 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌(పీజీఈసెట్‌) నిర్వహించనున్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది దరఖాస్తు చేశారు. వీరిలో ఓసీలు 3,346 మంది ఉన్నారు. అత్యధికంగా ఫార్మసీకి 7,376 మంది, కంప్యూటర్‌ సైన్స్‌-ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి 4,903 మంది దరఖాస్తు చేసుకున్నారు. 10 సబ్జెక్టులకు 100 మంది లోపు మాత్రమే పోటీ పడుతుండటం గమనార్హం. పోటీపడుతున్న మొత్తం అభ్యర్థుల్లో అమ్మాయిలు 12,532 మంది, అబ్బాయిలు 10,180 మంది ఉన్నారు. పరీక్ష మధ్యలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకురావాలని, మరో కంప్యూటర్‌పై పరీక్ష రాసే అవకాశముంటుందని, నష్టపోయిన సమయాన్ని కూడా పొందవచ్చని కన్వీనర్‌ ఆచార్య ఎ.అరుణ కుమారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని