Pakistan: లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్రంలో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు.

Published : 29 May 2024 13:20 IST

బలూచిస్థాన్‌: పాకిస్థాన్‌ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మీడియా కథనాల ప్రకారం.. 

టర్బాట్‌ నుంచి క్వెట్టాకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది.

ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది.. ఇజ్రాయెల్‌పై అగ్రరాజ్యం ఆగ్రహం!

డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే వాహనం అదుపుతప్పి ఆ లోయలో పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బాల్టిస్థాన్‌లోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకొంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోవడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు