US Air Show: ఎయిర్‌ షోలో విమానాలు ఢీకొని..

రెండు పురాతన యుద్ధవిమానాలు గాల్లో ఢీకొన్న ఘటన అమెరికాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు సమాచారం.

Updated : 13 Nov 2022 10:06 IST

ఇంటర్నెట్‌డెస్క్:  అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో విషాదకర ఘటన చోటు చేసుకొంది.  రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు ఢీకొని పలువురు మృతి చెందారు. ఈ విమానాలు భూమికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఎయిర్‌షోలో బోయింగ్‌  బీ-17 బాంబర్‌ విమానం, బెల్‌ పీ-63 కింగ్‌ కోబ్రా విమానం అత్యంత సమీపంలోకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎయిర్‌ షోలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ‘ది ఫెడరల్‌ ఎవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌’ ఓ ప్రకటనలో పేర్కొంది. వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. 

ఈ ప్రమాదంలో ఎంత మంది మృతిచెందారో మాత్రం అధికారులు వెల్లడించడంలేదు. ఆరుగురు సిబ్బంది చనిపోయి ఉండొచ్చని సమాచారం. వెటర్స్‌ గౌరవార్థం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఎయిర్‌షోను వీక్షించేందుకు దాదాపు 6 వేల మంది వరకు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ప్రమాదం చోటు చేసుకొంది. ఈ షోను వీక్షిస్తున్న ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయంలో బీ-17 బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. ఇక కింగ్‌కోబ్రా విమానాలను ఈ యుద్ధంలో సోవియట్‌ సేనలు మాత్రమే వాడాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని