Ukraine: జెండా ఊపుతూ ఉక్రెయిన్‌కు మద్దతు.. బాలుడికి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన ఆర్మీ!

Ukraine: ఉక్రెయిన్‌- రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Published : 08 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గడిచిన రెండేళ్లుగా ఉక్రెయిన్‌ (Ukraine)- రష్యా(Russia) మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చాలా కాలంగా ఉక్రెయిన్‌ సైన్యానికి మద్దతు తెలుపుతున్న ఓ బాలుడిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. చివరకు హెలికాప్టర్‌లో ఆ బాలుడి వద్దకు వెళ్లి అతడిని సర్‌ప్రైజ్‌ చేశారు.

యుద్ధం కొనసాగుతోన్న ప్రాంతంలో నివసిస్తోన్న ఓ బాలుడు.. ఉక్రెయిన్‌ ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు శబ్దం వినగానే అప్రమత్తమయ్యేవాడు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఉక్రెయిన్‌ జెండాను ఊపుతూ సైనికులకు తన మద్దతు తెలిపేవాడు. ఇలా కొంతకాలంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. బాలుడి చేస్తున్న ఆ పని.. సైనికుల హృదయాలను హత్తుకుంది. అతడి ఉత్సాహాన్ని చూసి ఉప్పొంగిపోయిన సైనికులు.. ఎలాగైనా అతడిని కలవాలని నిర్ణయించుకున్నారు. అలా ఓ రోజు బాలుడు ఉంటున్న ప్రదేశానికి రెండు హెలికాప్టర్లు వచ్చాయి. కిందకు దిగిన ఓ హెలికాప్టర్‌ నుంచి బయటకు వచ్చిన ఓ సైనికుడు.. బాలుడి దగ్గరకు వెళ్లి స్వీట్లు, బొమ్మలు, ఆహారం అందించి కృతజ్ఞతలు తెలిపాడు.

దక్షిణ చైనా సముద్రంలో పోటీగా డ్రాగన్‌ కాంబాట్‌ పెట్రోల్స్‌..!

పైనున్న మరో ఆర్మీ హెలికాప్టర్‌ చక్కర్లు కొడుతూ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. వీటిని ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ రోజును ఆ బాలుడు ఎప్పటికీ గుర్తుంచుకుంటాడంటూ పేర్కొంది. సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉక్రెయిన్‌ జెండాను ఊపుతూ మైదానం చుట్టూ పరిగెడుతున్న ఈ బాలుడిని చూసి నెటిజన్లు కూడా మద్దతుగా స్పందిస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు