China: దక్షిణ చైనా సముద్రంలో పోటీగా డ్రాగన్‌ కాంబాట్‌ పెట్రోల్స్‌..!

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు యుద్ధ విన్యాసాలు చేపట్టగా.. చైనా దళాలు కాంబాట్‌ పెట్రోల్స్‌ నిర్వహిస్తున్నాయి. 

Published : 07 Apr 2024 16:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంలో ఆదివారం డ్రాగన్‌ కాంబాట్‌ పెట్రోల్స్‌ నిర్వహించింది. అమెరికా, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా సంయుక్త విన్యాసాలు ప్రారంభించన రోజే ఈ చర్యకు దిగడం గమనార్హం. చైనా (China) కవ్వింపుల నేపథ్యంలో తమ దళాలు సంయుక్త విన్యాసాలు చేస్తాయని నాలుగు దేశాల డిఫెన్స్‌ ఛీఫ్‌లు శనివారం ప్రకటించారు. వెంటనే పీఎల్‌ఏ సదరన్‌ థియేటర్‌ కమాండ్‌ దీనికి స్పందించింది. తమ నౌకా, వైమానిక దళాలు కూడా దక్షిణ చైనా సముద్రంలో కాంబాట్‌ పెట్రోల్స్‌ నిర్వహిస్తాయిని ప్రకటించారు. కాకపోతే ఏ విన్యాసాలు చేస్తుందో మాత్రం వెల్లడించలేదు. 

మరోవైపు జపాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ భేటీ కావడానికి కొన్ని రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఫిలిప్పీన్స్‌ను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని కొన్నాళ్ల క్రితమే అమెరికా చెప్పిన విషయం తెలిసింది.

చైనాకు చేదు కబురు.. ఆకస్‌ కూటమిలోకి జపాన్‌..?

దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని ఇప్పటికే డ్రాగన్‌ ప్రకటించుకొంది. దీనిని ఆ ప్రాంతంలోని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత గురువారం కూడా ఫిలిప్పీన్స్‌ నౌకతో చైనా కోస్టుగార్డ్‌ ఘర్షణకు దిగింది. మనీలా దళాలే తమను కవ్విస్తున్నాయని, అక్రమంగా తమ జలాల్లోకి చొరబడుతున్నాయని చైనా ఆరోపించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని