ఆహారం కోసం.. భవనంపై నుంచి దూకిన బాలిక..!

ఆకలితో అలమటిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి టెడ్డీబేర్‌ సాయంతో కిందకు దూకింది. తల్లిదండ్రులు చాలా కాలంగా ఆమెకు ఆహారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. 

Updated : 25 Jul 2023 13:28 IST

వాషింగ్టన్‌: ఆహారం కోసం ఎనిమిదేళ్ల బాలిక మొదటి అంతస్తు నుంచి దూకింది. తల్లిదండ్రులు ఆమెకు కొన్ని రోజులుగా ఆహారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. అమెరికా (America)లోని వెస్ట్‌ వర్జీనియా (West Virginia)లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

ర్యాన్‌ కీత్‌ హర్డ్‌మన్‌, ఎలియో ఎమ్‌ దంపతులు ఆర్నాల్డ్స్‌బర్గ్లో నివాసముంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తమ ఎనిమిదేళ్ల  కుమార్తెకు చాలా రోజులుగా ఆహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారు. బాలికను బయటకు రాకుండా ఇంట్లోనే నిర్బంధించారు. ఆకలికి తట్టుకోలేని చిన్నారి టెడ్డీబేర్‌ సాయంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దగ్గర్లో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగింది. అందులో ఉన్న ఒక ఉద్యోగి పాప పరిస్థితిని గమనించి ఆహార పదార్థాలు అందించాడు. అనుమానంతో ఆమెను ప్రశ్నించగా.. ఆమె తన తల్లిదండ్రుల గురించి వివరించింది. విషయం తెలుసుకున్న ఉద్యోగి అధికారులకు సమాచారం అందించాడు.

నెలరోజులైంది... ఆయనెక్కడ?

‘‘నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. అమ్మ, నాన్న నన్ను సరిగా చూసుకోవడం లేదు. ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. నన్ను శిక్షించేవారు. అందుకే పై నుంచి దూకాను. మూడు రోజుల క్రితం ఒక బర్గర్‌ మాత్రమే తిన్నాను’’అని బాలిక తెలిపింది. వారి ఇంటిని అధికారులు సోదా చేశారు. ఇంట్లో ఆహారం ఉన్నా పెట్టడం లేదని తేలింది. వారి నుంచి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని