Malawi: మలావీ ఉపాధ్యక్షుడి విమానం అదృశ్యం.. గాలింపు చర్యలు ముమ్మరం

మలావీ (Malawi) ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

Published : 11 Jun 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫ్రికా దేశమైన మలావీ (Malawi) ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్‌ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది.

షెడ్యూల్‌ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్‌ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించిన అధ్యక్షుడు చక్వేరా.. తన బహామాస్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.

ఎన్నికలకు ముందే.. రిషి సునాక్‌ రాజీనామా చేయనున్నారా?

ఇటీవల ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు