China-Taiwan: చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. దూకుడు తగ్గించిన తైవాన్‌ అధ్యక్షుడు

తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె వ్యాఖ్యల ప్రభావంతో ద్వీపదేశం చుట్టు చైనా సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లాయ్‌ చింగ్‌ తన దూకుడు కాస్త తగ్గించారు. 

Updated : 26 May 2024 15:03 IST

తైపీ: తైవాన్‌ (Taiwan)కు నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె (Lai Ching-te) బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో చైనా (China)పై విరుచుకుపడ్డారు. ఈ విషయం బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా ఆ ద్వీపదీశం చుట్టూ డ్రాగన్‌ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో లాయ్‌ చింగ్‌ దూకుడు కాస్త తగ్గించారు. చైనాతో కలిసి సమన్వయం చేసుకొంటూ.. పని చేసేందుకు సిద్ధమేనన్నారు. ఆదివారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రాంతీయ స్థిరత్వం చాలా కీలకం. తైవాన్‌ జలసంధిలో అలజడులను అంతర్జాతీయ సమాజం అంగీకరించదు. ఈ నేపథ్యంలో చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పరస్పర అంగీకారంతో సంయుక్తంగా ఈ అంశాన్ని స్వీకరించాలని కోరుతున్నా’’ అని లాయ్‌ చింగ్‌ బీజింగ్‌కు పిలుపునిచ్చారు.

త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్‌.. హెజ్‌బొల్లా హెచ్చరిక

ఇటీవల తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా పేరొందిన లాయ్‌ చింగ్‌-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకార సందర్భంగా తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌కు గట్టిగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైనా, తైవాన్‌ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ క్రమంలోనే దూకుడును తగ్గించిన లాయ్‌ చింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని