Israel- Iran: ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయాలే లక్ష్యంగా.. ఇరాన్‌ హెచ్చరిక!

ఇజ్రాయెల్‌కు చెందిన ఒక్క దౌత్య కార్యాలయం కూడా ప్రస్తుతం సురక్షిత పరిస్థితుల్లో లేదని ఇరాన్‌ హెచ్చరించింది.

Published : 07 Apr 2024 21:53 IST

టెహ్రాన్‌: సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ (Iran) రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కీలక సభ్యులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్‌ (Israel)పై భగ్గుమన్న టెహ్రాన్‌.. ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించింది. ఆ దేశానికి చెందిన ఒక్క రాయబార కార్యాలయం కూడా ప్రస్తుతం సురక్షిత పరిస్థితుల్లో లేదని ఇరాన్‌ సైనిక సలహాదారు జనరల్‌ రహీం సఫావీ తాజాగా పేర్కొన్నారు. దౌత్య కార్యాలయంపై దాడికి ప్రతిగా అదే విధమైన దాడులకు పాల్పడతామని పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌పై దాడి తథ్యం!.. మధ్యలో మీరు తలదూర్చకండి

మరోవైపు.. ఎలాంటి ప్రతిస్పందనకైనా సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) తెలిపారు. ‘‘ఎవరైనా మాకు హాని చేసినా.. లేదా, దాని కోసం కుట్ర పన్నినా.. మేం వారి పనిపడతాం’’ అని స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇజ్రాయెల్‌పై తాము దాడి చేయడం ఖాయమని, మధ్యలో అమెరికా తలదూర్చకూడదని టెహ్రాన్‌ కోరిన విషయం తెలిసిందే. ఇదే జరిగితే.. ఇజ్రాయెల్‌- హమాస్‌ల వరకు పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని