విమానంలో నగ్నంగా పరుగులు.. హడలెత్తిన ప్రయాణికులు

విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. ఒంటిపైనున్న దుస్తులు తొలగించి విమానంలో నగ్నంగా పరుగులు తీశాడు.

Published : 28 May 2024 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అత్యవసర ద్వారాన్ని తెరవడం, సిబ్బందిని గాయపరచడం వంటివి తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతేకాకుండా సిబ్బందిని కిందకు తోసేసి గందరగోళం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్‌ ఆస్ట్రేలియా (Virgin Australia flight) విమానంలో చోటుచేసుకొంది. అసలేం జరిగిందంటే..

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు VA696 విమానం సోమవారం రాత్రి బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని కింద పడేశాడు. అతడి చర్యకు తోటి ప్రయాణికులు హడలెత్తారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.

ఆ విషాదం మరువకముందే.. టైటాన్‌ తరహాలో మరో సాహస యాత్ర..!

విమాన సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ.. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు’’ అని ప్రకటనలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు