Russia-Ukraine conflict: ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి: బెలారస్ అధ్యక్షుడు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని బెలారస్‌ అధ్యక్షుడు  అలెగ్జాండర్‌ లుకషెంకో (Alexander Lukashenko) అన్నారు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకుండా ఇరుదేశాలు చర్చలు జరపాలని కోరారు. 

Updated : 29 Oct 2023 12:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా ‘ప్రత్యేక సైనిక చర్య’ పేరిట కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోంది. అదే తీరులో ఉక్రెయిన్‌ కూడా స్పందిస్తోంది. ఈ యుద్ధంతో ఏ దేశానికి విజయం దక్కదని బెలారస్‌ (Belarus) అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో (Alexander Lukashenko) అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడారు.

ఉక్రెయిన్‌-రష్యా (Russia-Ukraine conflict) మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఫలితం తేలని పరిస్థితి నెలకొందని లుకషెంకో అభిప్రాయపడ్డారు. ‘‘యుద్ధం కారణంగా ఇరు దేశాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ పోరు ఫలితంగా ఎన్నో సమస్యలు తలెత్తాయి. అయినప్పటికీ, రెండు దేశాలు కూడా హోరాహోరీగా తలపడుతూనే ఉన్నాయి. దీని వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధ ఫలితంపై ప్రతిష్టంభన నెలకొంది. ఎవరూ పూర్తి స్థాయిలో పుంజుకోలేరు. కాబట్టి, రెండు దేశాలు కూడా చర్చల ద్వారా రాజీ ఒప్పందం కుదుర్చుకోవాలి’’ అంటూ లుకషెంకో పిలుపునిచ్చారు.

పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా.. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు

యుద్ధం ప్రారంభ సమయంలో బెలారస్‌ మీదుగా కూడా రష్యా దళాలు ఉక్రెయిన్‌ వైపు వెళ్లాయి. ఆ సమయంలో తమ సరిహద్దుల నుంచి రష్యా బలగాలను వెనక్కి పంపించేయాలని ఉక్రెయిన్‌ కోరిందని లుకషెంకో వెల్లడించారు. ఈ అంశంపై కూడా చర్చిస్తామని అన్నారు. ఈ చర్చలకు ఎలాంటి ముందస్తు షరతులు అవసరం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని