Joe Biden: ‘నేను విమానం డోర్‌ పక్కన కూర్చోనుగా’: బోయింగ్‌ ఘటనలపై బైడెన్‌ చమత్కారం

బోయింగ్‌ (Boeing) సంస్థ గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌, క్వాలిటీ సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ప్రశ్న ఎదురైంది. 

Updated : 30 Mar 2024 10:54 IST

న్యూయార్క్‌: తన బోయింగ్ (Boeing) విమానం ఎయిర్‌ ఫోర్స్ వన్ తలుపు వద్ద తాను కూర్చోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. ఇటీవల బోయింగ్ సంస్థకు చెందిన విమానాల్లో వెలుగుచూస్తోన్న ఘటనలను ఉద్దేశించి ఈ విధంగా చమత్కరించారు.

ఒక టాక్‌షో వ్యాఖ్యాత బైడెన్‌ (Biden)తో మాట్లాడుతూ.. ‘‘మీరు న్యూయార్క్‌ సిటీకి బయల్దేరేముందు మీ రవాణాశాఖ మంత్రి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ బోల్టులు బిగించారా..?’’ అంటూ ప్రశ్నించారు. ఇందుకు అధ్యక్షుడు బదులిస్తూ.. ‘‘నేను తలుపు పక్కన కూర్చోను. జస్ట్‌ జోక్‌ చేస్తున్నాను. అయితే ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదు’’ అంటూ వ్యాఖ్యానించారు.

సముద్రంలో మరో ఆపరేషన్‌.. 23 మంది పాక్‌ సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ

కొద్దినెలల క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరింది. 171 మంది ఆ సమయంలో ప్రయాణిస్తున్నారు. విమానం 16,000 అడుగుల ఎత్తుకు చేరగానే.. ఎడమవైపున్న తలుపు ఊడిపోయింది. దాని పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. అయితే విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

బోయింగ్‌ సంస్థ గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌, క్వాలిటీ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటోంది. దాంతో కంపెనీపై నియంత్రణ సంస్థల నిఘా మరింత ఎక్కువైంది. నాణ్యత, భద్రత విషయంలో తనిఖీలు తీవ్రతరం కావడంతో ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. దీంతో డెలివరీలు ఆగిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు