భారత్‌ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించాం: కెనడా అధికారిక ప్రకటన

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Nijjar Killing) హత్య కేసుతో భారత్‌-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కెనడా విదేశాంగ మంత్రి స్పందించారు. 

Updated : 20 Oct 2023 15:57 IST

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడా(Canada)కు న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో.. 41 మందిని వెనక్కి రప్పించినట్లు తాజాగా కెనడా(Canada) వెల్లడించింది. అంతేగాకుండా భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది.

‘41 మంది దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకోవడమేనది అనూహ్యమైన చర్య. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. అయితే కెనడా అదే తరహాలో స్పందించాలనుకోవడం లేదు. పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలనుకుంటోంది. అన్నిదేశాలకు వర్తించే అంతర్జాతీయ చట్టాలను కెనడా సమర్థిస్తూనే ఉంటుంది. అలాగే భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ( Melanie Joly) వ్యాఖ్యలు చేశారు.

హమాస్‌, రష్యా.. రెండూ ఒకటే: బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Nijjar Killing) హత్య కేసుతో దిల్లీలోని కెనడాకు చెందిన 62 మంది దౌత్యసిబ్బందిలో 41 మందిని ఒట్టావా వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ డెడ్‌లైన్‌ విధించింది. అక్టోబరు 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని, ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు గతంలో వార్తా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ సిబ్బందిని తగ్గించుకున్నట్లు కెనడా తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని