Canada- China: కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం.. నిఘా నివేదికలో వెల్లడి!

కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నట్లు అక్కడి నిఘా సంస్థ స్పష్టం చేసింది.

Published : 10 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ రాజకీయాల్లో విదేశీ జోక్యంపై కెనడా (Canada) ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనా (China) ప్రమేయం ఉన్నట్లు నిర్ధరణ అయింది. గత రెండు ఎన్నికల్లో డ్రాగన్‌ జోక్యం చేసుకున్నట్లు అక్కడి నిఘా సంస్థ స్పష్టం చేసింది. 2019, 2021లలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీనే విజయం సాధించడం గమనార్హం.

కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోందంటూ అక్కడి విపక్ష నేతలు ఇటీవల ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు అంగీకరించిన ప్రధాని ట్రూడో.. ఓ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ‘‘2019, 2021 ఎన్నికల్లో ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా (PRC)’ రహస్యంగా, మోసపూరితంగా జోక్యం చేసుకున్నట్లు తెలిసింది’’ అని కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (CSIS) నివేదిక వెల్లడించింది. రెండు సందర్భాల్లోనూ తమకు అనుకూలంగా, తటస్థంగా ఉన్నవారికి మద్దతు ప్రకటించిందని తెలిపింది.

భారత్‌కు వ్యతిరేకంగా యూకే కథనం.. అమెరికా ఏమందంటే..?

విదేశీ జోక్యాన్ని కట్టడి చేసేందుకు ట్రూడో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోలేదని ఇంటెలిజెన్స్‌ విశ్లేషకులు, ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో ప్రధాని ట్రూడో బుధవారం కమిషన్‌కు వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు.. కెనడా రాజకీయాల్లో జోక్యంపై వచ్చిన వార్తలను చైనా ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని