MEA: ‘భారత వ్యతిరేక శక్తులకు ఆశ్రయం.. కెనడాతో అదే ప్రధాన సమస్య!’

కెనడా భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న శక్తులపై ట్రూడో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది.

Published : 21 Dec 2023 21:57 IST

దిల్లీ: కెనడా (Canada)తో తమ ప్రధాన సమస్య అలాగే ఉందని భారత్‌ పేర్కొంది. వేర్పాటువాదులు, భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని మరోసారి స్పష్టం చేసింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ (Arindam Bagchi) గురువారం మీడియాతో మాట్లాడారు. కెనడా భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న శక్తులపై ట్రూడో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

‘చెక్‌ కోర్టుకు వెళ్లండి’: నిఖిల్‌ గుప్తాకు సుప్రీం సూచన

మరోవైపు.. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న, భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తాకు మూడు సందర్భాల్లో దౌత్యసాయానికి (Consular Access) అవకాశం లభించినట్లు అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. ప్రస్తుతం అతడు చెక్‌ రిపబ్లిక్‌లో జైలులో ఉన్నాడు. అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కుట్ర కేసులో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా ప్రమేయం ఉందంటూ ఆరోపించింది. అతడిని తమకు అప్పగించాలని చెక్‌ రిపబ్లిక్‌పై ఒత్తిడి తెస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని