Boxing: ప్రత్యర్థి ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసి.. పోటీ నుంచి నిష్క్రమించిన మహిళా బాక్సర్‌!

బాక్సింగ్‌ పోటీలో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ (Transgender) అని తెలియడంతో ఓ మహిళా బాక్సర్‌ పోటీ నుంచే (Boxing championship) వైదొలిగారు.

Published : 20 Nov 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల జరిగిన ఓ బాక్సింగ్‌ (Boxing) ఛాంపియన్‌షిప్‌లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పోటీలో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ (Transgender) అని తెలియడంతో ఓ మహిళా బాక్సర్‌ అవాక్కయ్యారు. దీంతో ఆమె పోటీ నుంచే (Boxing championship) వైదొలిగారు. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది.

కెనడాలో కొన్ని రోజుల క్రితం బాక్సింగ్‌కు సంబంధించి ప్రావిన్సికల్‌ గోల్డన్‌ గ్లవ్‌ ఛాంపియన్‌షిన్‌-2023 జరిగింది. అందులో పాల్గొన్న మహిళా బాక్సర్‌ కటియా బిస్సోనెట్‌కు.. మియా వాల్మ్‌స్లే ప్రత్యర్థిగా వచ్చారు. పోటీ ప్రారంభానికి ఓ గంట ముందే ఓ ఆసక్తికర విషయం కటియా చెవిన పడింది. తాను ఎదుర్కోబోయే ప్రత్యర్థి మహిళ కాదని.. ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసింది. దాంతో పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు చివరి క్షణంలో సదరు క్రీడాకారిణి ప్రకటించారు. చివరకు ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ట్రాన్స్‌జెండర్‌గా భావిస్తోన్న వ్యక్తినే నిర్వాహకులు విజేతగా ప్రకటించారు.

16 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 707 ఏళ్ల జైలుశిక్ష!

తాను పోటీ నుంచి నిష్క్రమించడాన్ని బిస్సోనెట్‌ సమర్థించుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ.. గతంతో కొన్ని నివేదికలను ప్రస్తావించారు. మహిళల కంటే పురుషుల బలంగా పంచ్‌లు వేయగలరని యూనివర్సిటీ ఆఫ్‌ ఉటా నివేదికలో తేలిందన్నారు. మరోవైపు, తన జెండర్‌ గురించి బిస్సోనెట్‌ మీడియా ముందు బహిరంగంగా వ్యక్తపరచడంపై వాల్మ్‌స్లే అసంతృప్తి వ్యక్తం చేశారు. వాల్మ్‌స్లే ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి కాగా.. రెండేళ్ల క్రితమే కెనడాకు వచ్చినట్లు తెలిసింది. కెనడాకు రాకముందే లింగమార్పిడి చేయించుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని