Molesting: 16 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 707 ఏళ్ల జైలుశిక్ష!

16 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ యువకుడికి అమెరికన్‌ కోర్టు 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Updated : 19 Nov 2023 18:17 IST

కాలిఫోర్నియా: చిన్నారుల సంరక్షణ చూడాల్సిన ఓ వ్యక్తి (Nanny).. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాదాపు 16 మంది అబ్బాయిలపై ఆ దుర్మార్గుడు వేధింపులకు పాల్పడటం గమనార్హం. ఈ కేసులో అతడికి తాజాగా 707 ఏళ్ల జైలు శిక్ష పడింది. దర్యాప్తులో నేరం చేసినట్లు తేలినప్పటికీ.. తన చర్యలను నిందితుడు సమర్థించుకోవడం గమనార్హం.

కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూ జాక్‌జేవ్‌స్కీ (34) స్థానికంగా చిన్నారుల సంరక్షణ బాధ్యతలు (Nanny) చూస్తుంటాడు. ఈ క్రమంలో తమ కుమారుడితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఓ కుటుంబం గుర్తించింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వాస్తవం బయటపడింది. ఇలా 2014 నుంచి 2019 మధ్యకాలంలో దాదాపు 16 మంది బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. బాధిత చిన్నారులంతా 2 నుంచి 14 ఏళ్ల వయసులోపు వారేనని పోలీసులు గుర్తించారు. ఇటీవల నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

హిందూ విశ్వాసమే నన్ను అధ్యక్ష ఎన్నికలవైపు నడిపించింది: వివేక్ రామస్వామి

చిన్నారులపై వేధింపులకు పాల్పడినప్పటికీ న్యాయస్థానం ముందు కూడా నిందితుడు నేరాన్ని అంగీకరించకపోగా.. తాను చేసింది కరక్టేనంటూ వాదించడం గమనార్హం. అతడి తీరుపై న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ‘పిల్లల సంరక్షణ చూసే బాధ్యత ఇతడికి లేదు. ఇతడు ముసిముసి నవ్వులతో మారువేషంలో ఉన్న ఓ రాక్షసుడు’ అంటూ ఆరెంజ్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడికి మొత్తంగా 707 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని