Maldives-China: మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్‌ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా

మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్‌ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.

Published : 28 Mar 2024 00:07 IST

మాలే: భారత్‌తో ద్వైపాక్షిక వివాదం తర్వాత మాల్దీవుల (Maldives)కు అన్నివిధాలా సాయం చేస్తామని చైనా (China) ప్రకటించింది. ఇందులోభాగంగా ఆ దేశానికి 1,500 టన్నుల తాగునీరు అందజేసింది. టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి చైనా వీటిని సేకరించింది. గతేడాది నవంబరులో టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ ఛైర్మన్‌ యాన్‌ జిన్హాయ్‌ మాల్దీవుల్లో పర్యటించారు. ఈసందర్భంగా తాగునీటి కొరతను అధిగమించేందుకు ద్వీప దేశానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

మాల్దీవులతో ఇప్పటికే చైనా సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులోభాగంగా తమ దేశానికి చైనా బాష్ప వాయుగోళాలు, పెప్పర్‌ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను ఉచితంగా అందించడంతోపాటు సైనిక శిక్షణ ఇస్తుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు వెల్లడించారు. తాజాగా తాగునీటి కొరతను అధిగమించేందుకు సాయం చేసింది. చైనా పంపిన నీటితో తమ దేశంలో తాగునీటి కొరతను అధిగమించవచ్చని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. త్వరలోనే ఈ నీటిని అన్ని ప్రాంతాల్లో సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. 

మీ వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి’: నౌకలోని భారత సిబ్బందికి బెడైన్‌ ప్రశంసలు

మాల్దీవులకు పొరుగున ఉన్న దేశాలు తాగునీటిని అందించడం ఇదే తొలిసారి కాదు. 2014లో ఆ దేశంలో తాగునీరు, మురుగునీటి నిర్వహణ సంస్థలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర కొరత ఏర్పడింది. ఆ సమయంలో భారత్ ‘ఆపరేషన్ నీర్‌’ పేరిట మాల్దీవులకు మొదటివిడతలో 375 టన్నుల తాగు నీటిని సరఫరా చేసింది. తర్వాత ఐఎన్‌ఎస్‌ దీపక్‌, ఐఎన్‌ఎస్‌ సుకన్య నౌకల ద్వారా రెండు వేల టన్నుల నీరు అందజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని