Elon Musk: మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర పోస్ట్‌

Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అంచనా వేస్తున్నారు.

Published : 18 May 2024 00:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నేను అంగారక (Mars Planet) గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నాను..’ స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గతంలో ఓసారి చెప్పిన మాటలివి. మరో గ్రహంపై మానవాళి జీవనం సాగించాలని గత కొంతకాలంగా బలంగా వాదిస్తున్న మస్క్‌ ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. తాజాగా దీనిపై ఆయన చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. మరో 30 ఏళ్లలో అంగారకుడిపై నగరం ఏర్పడటమే గాక.. అక్కడ మనుషులు కూడా జీవిస్తారని ఆయన అంచనా వేశారు.

‘మరికొన్ని సంవత్సరాల్లో మనం అంగారకుడిపై అడుగుపెడతాం’ అని ఓ ఎక్స్‌ యూజర్‌ చేసిన పోస్ట్‌కు మస్క్‌ స్పందించారు. ‘‘ఐదేళ్లలోపే ఆ గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుంది. 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతాం. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తాం. కచ్చితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుంది’’ అని ఆయన రాసుకొచ్చారు.

యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?

ఈ అరుణ గ్రహంపై మస్క్‌ ఆసక్తి కనబర్చడం ఇదే తొలిసారి కాదు. అంగారకుడిపైకి 10 లక్షల మందిని తరలించేందుకు ఓ గేమ్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ కాలనీని ఏర్పాటుచేసి మానవాళిని బహుళ-గ్రహ జాతులుగా మార్చాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే, ఎప్పటివరకు తీసుకెళ్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

మరోవైపు, భవిష్యత్తులో అంగారక గ్రహంపై చేపట్టే ప్రయోగాల కోసం స్పేస్ఎక్స్‌ సంస్థ ‘స్టార్‌షిప్‌’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది. 500 అడుగుల పొడవు ఉండే ఈ వాహక నౌక ప్రస్తుతం అందుబాటులో  ఉన్న సూపర్‌ హెవీ రాకెట్ల కంటే 20శాతం పెద్దది కావడం విశేషం. ఈ రంగంలో మస్క్‌ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు