Bridge collapse:: ఆ నౌకలోని సిబ్బంది అంతా భారతీయులే!

అమెరికా బాల్టిమోర్‌లో భారీ నౌక బ్రిడ్జ్‌ని ఢీకొన్న కార్గో షిప్‌లో 22 మంది సిబ్బంది మొత్తం భారతీయులేనని సదరు కంపెనీ వెల్లడించింది.

Published : 26 Mar 2024 21:32 IST

వాషింగ్టన్: అమెరికాలోని బాల్టిమోర్‌ నగరంలో భారీ నౌక ఢీకొనడంతో బ్రిడ్జ్‌ కూప్పకూలిన విషయం తెలిసిందే. సింగపూర్‌కు చెందిన ఆ కార్గో షిప్‌లో 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా భారతీయులేనని సదరు కంపెనీ వెల్లడించింది. సింగపూర్‌కు చెందిన గ్రీస్‌ ఓషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్గో నౌక ‘దాలీ’ బాల్టిమోర్‌ నుంచి కొలంబోకు బయలుదేరింది. మధ్యలో అర్ధరాత్రి దాదాపు 1.30గంటల సమయంలో ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జ్‌లోని ఓ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు విధుల్లోనే ఉన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాద ఘటనపై అమెరికా దర్యాప్తు మొదలుపెట్టింది. ఇందుకు నౌక సిబ్బంది పూర్తిగా సహకరిస్తున్నారని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

నౌక బ్రిడ్జిని ఢీకొనడంతో ఫ్రాన్సిస్‌ స్కాట్ కీ బ్రిడ్జ్‌ కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై ఉన్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది గల్లంతైనట్లు సమాచారం. దీంతో పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు