Earthquake: అఫ్గానిస్థాన్‌పై భూప్రకోపం.. 48గంటలు దాటకముందే మళ్లీ ప్రకంపనలు!

కాబుల్: వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్‌ను వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం(Earthquake)తో అతలాకుతలమవుతున్న తరుణంలో మరోసారి భూమి కంపించింది. తాజాగా తూర్పు అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 34కి.మీల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఇటీవల భూకంపం సంభవించి 48గంటలు కూడా ఇంకా గడవకముందే మరోసారి ప్రకంపనలతో అక్కడి ప్రజలు భయంతో వణుకుతున్నారు.
ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో నమోదైన తీవ్ర భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది. ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందగా.. 3,124మంది గాయపడినట్లు తాలిబన్ ప్రబుత్వ అధికార ప్రతినిధి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. మరోవైపు, ఈ భూప్రకోపానికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకొనేందుకు చేతులతోనే అనేకమంది మట్టిని తవ్వి తీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


