Earthquake: అసలే వరదలు.. ఆపై భూకంపం.. వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం!

పపువా న్యూగినీ ద్వీప దేశాన్ని భూకంపం కుదిపేసింది. భూప్రకంపనల ధాటికి వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు అయిదుగురు మృతి చెందారు.

Published : 25 Mar 2024 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పసిఫిక్‌ మహాసముద్రంలోని పపువా న్యూగినీ (Papua New Guinea) ద్వీప దేశాన్ని పెను భూకంపం (Earthquake) కుదిపేసింది. ఇక్కడి తూర్పు సెపిక్‌ ప్రావిన్స్‌లో 6.9 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనల ధాటికి వెయ్యికిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు అయిదుగురు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అంబుంటి పట్టణ సమీపంలో 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

కిమ్‌ కూర్చొని మాట్లాడుకుందాం.. చర్చలకు జపాన్‌ ప్రతిపాదన

సెపిక్‌ నది వరదల కారణంగా తూర్పు సెపిక్‌ ప్రావిన్స్‌ ఇప్పటికే తీవ్రంగా ప్రభావితం కాగా.. తాజా విపత్తుతో పరిస్థితులు మరింత దిగజారాయని స్థానిక గవర్నర్‌ అలన్‌ బర్డ్‌ వెల్లడించారు. ‘‘నది పొడవునా 800 కిలోమీటర్ల మేర 60 నుంచి 70 గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతుండగానే భూకంపం సంభవించింది. దీంతో నష్టం ఎక్కువగా ఉంది’’ అని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌, సెప్టెంబరుల్లోనూ స్థానికంగా పలు భూకంపాలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని