Earthquake: జపాన్‌లో భూకంపం.. భయపెడుతున్న నివేదిక!

Eenadu icon
By International News Team Published : 03 Apr 2025 00:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌లోని క్యుషులో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ప్రస్తుతానికి ఎటువంటి నష్టం సంభవించలేదని సమాచారం. అయితే, దేశంలో భారీ భూకంపం సంభవిస్తే కలిగే నష్టాలకు సంబంధించి ఓ నివేదిక విడుదలైన రెండు రోజులకే తాజా భూప్రకంపనలు చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు, మయన్మార్‌, థాయ్‌లాండ్‌లలో ఇటీవల 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించి వేలాది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విషయం తెలిసిందే.

భయపెడుతున్న నివేదిక

జపాన్‌లో భూకంప ఘటనలకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ఎప్పటినుంచో అంచనా వేస్తున్నట్లుగా.. పసిఫిక్‌ తీరంలో ఒకవేళ భారీ భూకంపం సంభవిస్తే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని, 1.81 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిళ్లవచ్చని పేర్కొంది. భీకర సునామీలు రావచ్చని, దీంతో వందలాది భవనాలు నేలమట్టమవుతాయని తెలిపింది. తద్వారా దాదాపు 3లక్షల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు లక్షలాదిమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేయడం కలవరపెడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు