Iran-Israel: ‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఘర్షణ వేళ మస్క్‌ పోస్ట్‌

Iran-Israel: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల వేళ ఎలాన్‌ మస్క్‌ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్‌మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Updated : 19 Apr 2024 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని.. అంతరిక్షంలోకి పంపించాలి’’ అంటూ శాంతియుత పరిస్థితులకు ఆయన పిలుపునిచ్చారు. ఓ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తున్న ఫొటోను దీనికి జత చేశారు.

పేలుళ్లలో నష్టం జరగలేదు: ఇరాన్‌

శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో అధికారులు వెంటనే గగనతల రక్షణ వ్యవస్థలను (Iran Air Defence System) యాక్టివేట్ చేశారు. గగనతలంలో కన్పించిన అనుమానాస్పద వస్తువులను రక్షణ వ్యవస్థ సమర్థంగా కూల్చివేసిందని, ఆ పేలుడు శబ్దాలు దానివేనని ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు.

డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్‌.. ‘నో కామెంట్స్‌’ అంటున్న ఇజ్రాయెల్‌

ప్రస్తుతానికి పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి. అయితే, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లే విమానాలను పలు దేశాలు రద్దు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని