Air Canada: టేకాఫ్ అయిన కాసేటికే.. విమాన ఇంజిన్‌లో మంటలు

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌ నుంచి భారీగా మంటలు వచ్చాయి. దీంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయింది. 

Updated : 08 Jun 2024 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌ కెనడా విమానానికి (Air Canada flight) పెద్ద ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన టొరంటోలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే..

స్థానిక కాలమానం ప్రకారం.. బోయింగ్‌ 777 విమానం శుక్రవారం ఉదయం 12.17 గంటలకు టొరంటో నుంచి బయలుదేరింది. ఆ విమానంలో  389 మంది ప్రయాణికులు సహా 13 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుడివైపు ఇంజిన్‌ నుంచి మంటలు రావడం మొదలైంది. రన్‌వే మీదుగా పైకి వెళుతుండగా.. మంటలను గమనించిన గ్రౌండ్‌ సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను అప్రమత్తం చేసింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే విమానాన్ని తిరిగి ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

డెన్మార్క్‌లో అనూహ్య ఘటన.. ఏకంగా ప్రధానిపైనే దాడి

అగ్నిప్రమాద ఘటనపై ఎయిర్‌ కెనడా స్పందించింది. ‘‘విమానంలోని కంప్రెసర్‌ ఆగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. అయితే భారీ ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. అదేరోజు ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేశాం’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని