Singapore Airlines: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో కుదుపులు.. ప్రయాణికుల మెదడు, వెన్నుకు తీవ్ర గాయాలు!

Singapore Airlines Turbulence Incident: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SQ321 విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Published : 24 May 2024 09:19 IST

బ్యాంకాక్‌: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆకాశంలో భారీ కుదుపునకు (Singapore Airlines Turbulence Incident) లోనైన ఘటనలో కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు బ్యాంకాక్‌ ఆసుపత్రి వర్గాలు గురువారం వెల్లడించాయి. కొందరికి పుర్రె , మెదడు, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు తెలిపాయి. వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మరణించిన విషయం తెలిసిందే.

బాధితుల్లో ఆరుగురు పుర్రె, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు బ్యాంకాక్‌లోని సమితివేజ్ శ్రీనకరిన్ హాస్పిటల్ డైరెక్టర్‌ వెల్లడించారు. మరో 22 మంది వెన్నెముక, 13 మంది ఎముకలు, కండరాల గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విమాన కుదుపులకు గాయపడిన అనేక మందికి గతంలో చికిత్స అందించామని పేర్కొన్నారు. కానీ, ఈ తరహా గాయాలను చూడడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. గాయపడిన వారిలో రెండేళ్ల నుంచి 83 ఏళ్ల వయస్కులు ఉన్నట్లు వెల్లడించారు.

తైవాన్‌ చుట్టూ మోహరించిన చైనా

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SQ321 విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ముగ్గురు భారతీయులు సహా మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది అందులో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే దానిని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనపై సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులను క్షమాపణలు కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు