Indian students: నదిలో మునిగి.. రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి

Indian students: భారత్‌కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు రష్యాలోని ఓ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

Published : 07 Jun 2024 12:49 IST

మాస్కో: రష్యా (Russia)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతంలోని ఓ నదిలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు (Indian Medical students) కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీయగా.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని యరోస్లోవ్‌ ది వైస్‌ నోవోగొరోడ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు (Indian Students) జూన్‌ 5న తమకు సమీపంలోని వోల్ఖోవ్‌ నది ఒడ్డున వాకింగ్‌కు వెళ్లారు. వారు నడుస్తుండగా ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తూ నీటిలోకి జారిపడింది. ఆమెను కాపాడేందుకు నలుగురు విద్యార్థులు నదిలోకి దిగారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు కొట్టుకుపోగా (Drowned in River).. ఓ అమ్మాయిని స్థానికులు కాపాడారు.

పోలీసులను చూసి పరుగులు.. భవనం పైనుంచి దూకి వ్యక్తి మృతి

సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో ఓ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించగా.. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మృతులను హర్షల్‌ అనంత్‌రావ్‌, జీషన్‌ పింజారీ, జియా పింజారీ, మాలిక్‌ మహమ్మద్‌ యాకూబ్‌గా గుర్తించారు. వీరిలో జీషన్‌, జియా, హర్షల్‌ది మహారాష్ట్ర (Maharashtra)లోని జల్‌గావ్‌ జిల్లా.

ఆ జిల్లా కలెక్టర్‌ ఆయుష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థుల మృతిని ధ్రువీకరించారు. వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. ఇది దురదృష్టకర ఘటన అని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు