అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి

అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్‌ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Published : 30 Nov 2023 05:25 IST

అరెస్టు చేసిన పోలీసులు

 న్యూయార్క్‌: అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్‌ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు, స్థానిక మీడియా వెల్లడించింది. దిలీప్‌కుమార్‌ బ్రహ్మభట్‌ (72), బిందు బ్రహ్మభట్‌ (72), యశ్‌కుమార్‌ బ్రహ్మభట్‌ (38)లను.. ఓం కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై మూడు హత్యలకు పాల్పడ్డాడని, ఆయుధాన్ని కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ అభియోగాలు మోపినట్లు వివరించారు. గుజరాత్‌ నుంచి వలస వచ్చిన ఓం.. బాధితులతో కలిసి నివసిస్తున్నాడు. సంఘటన జరిగిన ప్రదేశానికి తాము చేరుకున్న సమయానికి అతను అక్కడే ఉన్నాడని పోలీసులు చెప్పారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు