పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం

సంప్రదాయ ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్‌ అట్లాంటిక్‌ విమానం నింగిలోకి దూసుకెళ్లింది.

Published : 30 Nov 2023 05:25 IST

వాషింగ్టన్‌: సంప్రదాయ ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్‌ అట్లాంటిక్‌ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. వందశాతం సుస్థిర విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్‌) వినియోగించిన తొలి వాణిజ్య విమానంగా రికార్డు సృష్టించింది. ఈ ఇంధనంతో గతంలో ఓ సరకు రవాణా విమానం నింగిలోకి దూసుకెళ్లినప్పటికీ.. ప్రయాణికుల విమానం మాత్రం ఇదే తొలిసారి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ మంగళవారం లండన్‌ నుంచి బయల్దేరి న్యూయార్క్‌లోని జాన్‌.ఎఫ్‌.కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో వర్జిన్‌ అట్లాంటిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌, కొంత మంది సిబ్బంది మాత్రమే ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులను అనుమతించలేదు. ఏవియేషన్‌ టర్బయిన్‌ ప్యూయెల్‌ ఆధారంగానే విమానాలు ప్రయాణిస్తుంటాయి. కానీ, వీటివల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్వేషణ సాగుతోంది. ఇందులో భాగంగా సుస్థిర విమాన ఇంధనం తయారీపై వివిధ సంస్థలు దృష్టి సారించాయి. వినియోగించిన వంటెనూనెలను, జంతువుల వ్యర్థ కొవ్వులకు పాడైన మొక్కజొన్న నుంచి తీసిన సింథటిక్‌ కిరోసిన్‌ కలిపి ఈ ఇంధనాన్ని తయారు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని