రోదసిలోకి జంతువులను మోసుకెళ్లే క్యాప్సూల్‌ను ప్రయోగించాం

సమీప భవిష్యత్తులో మానవసహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా తాము కీలక ముందడుగు వేసినట్లు ఇరాన్‌ తెలిపింది.

Published : 07 Dec 2023 05:48 IST

ఇరాన్‌ వెల్లడి

టెహ్రాన్‌: సమీప భవిష్యత్తులో మానవసహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా తాము కీలక ముందడుగు వేసినట్లు ఇరాన్‌ తెలిపింది. జంతువులను రోదసిలోకి మోసుకెళ్లగల సామర్థ్యమున్న క్యాప్సూల్‌ను బుధవారం 130 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపించినట్లు ప్రకటించింది. అయితే 500 కిలోల బరువున్న ఆ క్యాప్సూల్‌లో ఏవైనా జంతువులను పంపించారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. 2029లోగా తమ వ్యోమగాములను రోదసిలోకి పంపించాలని భావిస్తున్నామని.. అందుకు తగ్గట్లు భవిష్యత్తులో జంతువులతో ప్రయోగ పరీక్షలు చేపడతామని ఇరాన్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని